ఏపీలో పౌర్ణమి సందర్భంగా ఈనెల 18వ తేదీన విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఉదయం 5.55 గంటలకు కామథేను ఆలయం నుంచి కమ్మరిపాలెం, 4 స్తంభాలు, విద్యాధరపురం, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్ రావునగర్, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, రథం సెంటర్ మీదుగా మహామండలం వద్ద ప్రదక్షిణ ముగుస్తుంది. ఇటీవల ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు.
అయితే, గిరిప్రదక్షిణ కోసం విజయవాడ కనకదుర్గ ఆలయం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసే ప్రాంతాల మీదుగా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు ఆంక్షలు విధించారు. అయితే, ఇంద్ర కీలాద్రిలో పౌర్ణమి నాడు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.గిరి ప్రదక్షిణ కోసం ప్రత్యేక రవాణా సదుపాయాలు సైతం కల్పించున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.