ఇండియాలో మొదటిసారి సూపర్‌గర్ల్ కథాంశంతో విజువల్ వండర్‌గా రాబోతున్న చిత్రం `ఇంద్రాణి`. వినూత్న తరహాలో భారీ వీఎఫ్ఎక్స్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా స్టీఫెన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యానియా భరద్వాజ్, కబీర్ సింగ్, ఫ్రణిత జిజిన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంద్రాణి మూవీ ఈ రోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నరేష్ విజయకృష్ణ క్లాప్ కొట్టగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇంద్రాణి మోషన్‌పోస్టర్‌ను తుంబాడ్(హింది) దర్శకుడు రాహి అనిల్ బార్వే విడుదల చేశారు.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ – “పక్కా కంటెంట్ ను నమ్మి చేస్తున్న చేస్తున్న చిత్రమిది. మోషన్‌పోస్టర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు..కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
చిత్ర దర్శకుడు స్టీఫెన్ మాట్లాడుతూ – “ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. చిన్నపిల్లలందరికి ఇండియాలో సూపర్ హీరో లేరు. ఈ సినిమా రిలీజ్ తరువాత ఇంద్రాణి గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటారు. ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్న పక్కా మాస్ మార్వెల్ సినిమా. అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉంటాయి. ప్రపంచం మొత్తం ఇంద్రాణి వైపు చూసేలా క్రియేటివ్ వరల్డ్ లా ఈ సినిమాను భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందింస్తున్నామన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్టాన్లీ సుమన్ బాబు మాట్లాడుతూ – “ రెండున్నర సంవత్సరాల పాటు శ్రమించి స్టీఫెన్ చాలా అద్భుతమైన కథను రెడీ చేశారు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. సాయి కార్తీక్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ అవుతుంది“ అన్నారు.