డేటింగ్ యాప్ లో తెలుగు నటి ఫోటోలు, ఆమె రియాక్షన్ ఏంటీ…?

-

సోషల్ మీడియాలో నటి గీతాంజలి ఫోటోలు రావడం సంచలనం అయింది. దీనిపై ఆమె స్పందించారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్ లో నా ఫోటో పెట్టినట్లు తెలిసింది అని నా స్నేహితురాలు కాల్ చేసి చెప్పెంతవరకు నాకు తెలియదు అని ఆవేదన వ్యక్తం చేసారు. సెలబ్రిటీల ఫోటోలు పెట్టుకొని డబ్బులు సంపాదించే వారిపై చర్యలు తీసుకోవాలి అని ఆమె డిమాండ్ చేసారు. ఇంకొక అమ్మాయికి ఇలాంటి ఘటనలు జరగకూడదు అని అన్నారు.

ఒక రంగంలో ఎదుగుతుంటే కొందరు కావాలని ఇలా టార్గెట్ చేస్తారు అని తనపై పర్సనల్ గా గ్రజ్ పెట్టుకొని ఇలా చేసి ఉంటారని అనుకుంటున్న అని ఆమె అన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను పోలీసులపై నాకు నమ్మకం ఉంది అని తెలిపారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు అని ఎవరు అయిన సరే ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు అని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు. నా ఫోటో హాట్ లైవ్ డేటింగ్ యాప్ లో పెట్టారు నా ఫోటో పెట్టినట్లు కాల్స్ వస్తున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version