BREAKING : బజాజ్ గ్రూప్ అధినేత రాహుల్ బజాజ్ మృతి

-

బజాజ్ గ్రూప్ అధినేత రాహుల్ బజాజ్ కన్నుమూశారు. 83 సంవత్సరాలు ఉన్న రాహుల్ బజాజ్ కాసేపటి క్రితమే మృతి చెందారు. గత కొంత కాలంగా క్యాన్సర్ మహమ్మారి తో బాధపడుతున్న రాహుల్ బజాజ్ ఇవాళ మృతి చెందారు. ఆయన పరిస్థితి విషమించడంతో.. నిన్న రాత్రి ఆయనను ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆయన పరిస్థితి అదుపు తప్పడంతో ఇవాళ మరణించారు. దాదాపు 50 సంవత్సరాలపాటు బజాజ్ కంపెనీ కి రాహుల్ బజాజ్ ఛైర్మెన్ గా వ్యవహరించారు.

బజాజ్ గ్రూప్ అధినేత రాహుల్ బజాజ్ మృతిపై బజాజ్ గ్రూప్ ప్రకటన కూడా విడుదల చేసింది. “దివంగత రూపా బజాజ్ భర్త మరియు రాజీవ్/దీపా, సంజీవ్/షెఫాలీ మరియు సునైనా/మనీష్‌ల తండ్రి అయిన శ్రీ రాహుల్ బజాజ్ మరణించడం పట్ల తీవ్ర విచారంతో మీకు తెలియజేస్తున్నాను. 12 ఫిబ్రవరి, 2022 మధ్యాహ్నం తన సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో తుదిశ్వాస విడిచారు.” అంటూ ప్రకటనలో తెలిపింది. అటు సన్నిహితులు కూడా ఆయన మృతికి సంతాపం తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version