నిర్మల్ జిల్లాలో వినూత్నంగా బడిబాట కార్యక్రమం

-

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని కుంటాల మండలం పెంచికలపాడు గ్రామంలో వినూత్నంగా నిర్వహించారు. సోమవారం బడిబాట ఐదో రోజు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఎడ్లబండి పై ఉపాధ్యాయులు కూర్చుని ప్రధాన వీధుల గుండా ర్యాలీగా వెళ్తూ ప్రభుత్వ పాఠశాలలో చేరలంటూ, ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న వసతుల గురించి ప్రజలకు తెలుపుతూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.

ప్రైవేట్ వద్దు ప్రభుత్వ బడి ముద్దు అనే నినాదంతో ఐదు సంవత్సరాలు నిండిన విద్యార్థుల ఇంటికి వెళ్లి పూలమాలతో సత్కరించి పాఠశాలల్లో ప్రవేశం కల్పించారు. వినూత్న రీతి ప్రచారాన్ని చూసిన గ్రామస్తులు ప్రైవేటు పాఠశాల కు ఏ రకంగా తీసిపోదని కొనియాడారు. ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులు చాలా వరకు ఫెయిల్ అయిన వారే ఉంటారని.. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించిన వారు ఉంటారని తెలిపారు. ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే.. పిల్లల భవిష్యత్ బాగుంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news