స్ఫూర్తి: గ్రాడ్యుయేషన్ లో చాలా సబ్జెక్ట్స్ ఫెయిల్.. కానీ ఇప్పుడు కలెక్టర్..!

-

కొంత మందిని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు వెళితే మనం కూడా మంచిగా సక్సెస్ అవ్వడానికి అవుతుంది. అయితే మన గతం మన భవిష్యత్తు రెండు ఒకేలా ఉంటాయని మనం ప్రయత్నం చేయకపోవడం మన తప్పే. ఏదో ఒక రోజు మన రోజు మారిపోతూ ఉంటుంది ఆ రోజు కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి ఈరోజు సరిగ్గా చదువుకోవడం లేదని మంచి ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఉంటే భవిష్యత్తు కూడా అలానే ఉంటుంది. అందుకనే ఎప్పుడూ కూడా మీరు మీ పట్ల కాన్ఫిడెన్స్ తో ఉండాలి. సక్సెస్ అవ్వడానికి చూసుకుంటూ ఉండాలి.

ఓటమి వచ్చిందని దానిలోనే ఉండిపోతే అది నిజంగా మీ తప్పే. అలానే మీ పైన నమ్మకాన్ని మీరు ఎప్పుడూ కోల్పోకూడదు. ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవుతానని పాజిటివ్ గా మీ పట్ల ఉండండి. గతంలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు కుమార్ అనురాగ్. అయినప్పటికీ తన మీద నమ్మకాన్ని వదులుకోలేదు.

ఎనిమిదవ తరగతి దాకా హిందీ మీడియంలో చదువుకుని ఆ తర్వాత మీడియం మారడంతో సమస్యలు వచ్చాయి. టెన్త్, 12వ తరగతి కూడా పూర్తి చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. తర్వాత ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో చేరారు కానీ గ్రాడ్యుయేషన్ లో చాలా సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారు ఎంతో కష్టపడి 2014లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

తర్వాత పీజీ కూడా ఎన్నో కష్టాలు పడి పాసయ్యారు. 2017లో మొదటిసారి సివిల్స్ పరీక్షలు రాశారు కానీ మొదటి ప్రయత్నంలో అనుకున్నంత ర్యాంకు రాలేదు 2019లో మరోసారి యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలు రాసి 48వ ర్యాంక్స్ సొంతం చేసుకున్నారు. ఇలా కలెక్టర్ గా ఇప్పుడు నలుగురికి స్ఫూర్తిగా నిలిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version