“ఇంస్టా” పోస్ట్ లద్వారా ఆదాయం .. రూ. 37 లక్షలకు టోకరా !

-

ప్రస్తుతం ఉన్న యూత్ ఈజీ మనీకి బాగా అలవాటు పడిపోయారు. ఈ అవకాశాన్ని మోసగాళ్లు బాగా క్యాష్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా లింక్ లను పంపించి.. వాటి ద్వారా బ్యాంక్ అకౌంట్ ల నుండి డబ్బులు లాక్కోవడం వంటి ఎన్నో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఒక ఘటన ఎందరినో మెలుకునేలా చేసింది అని చెప్పాలి. ఇంస్టాగ్రామ్ పోస్ట్ లు పంపించి వాటిని లైక్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయని ఆశ చూపిస్తున్నారు. ఈ విధంగా ఒక వ్యక్తికి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. కాగా లైక్ చేసిన ప్రతి మెసేజ్ కు రూ. 70 లు ఇవ్వడం కమిట్మెంట్. ఇలా అతన్ని బాగా అలవాటు చేసి నమ్మకాన్ని కలిగించి, అతనితో క్రిప్టో లో పెట్టుబడి పెట్టేలా ఉసిగొల్పారు. అయితే మొదటి కొన్ని రోజులు అతనికి క్రిప్టో ద్వారా లాభాలు వచ్చేలా చేశారు.

అంతటితో ఒకేసారి 37 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించారు. దీనితో ఆ డబ్బును మోసగాళ్లు బ్లాక్ చేసి కాజేశారు. దానితో బాధితుడు మోసపోయానని గర్హించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version