ప్రభాస్ – పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో రాధే శ్యామ్ అనే సినిమాను డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ రెస్పాన్స్ ని ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఆ చిత్ర డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్‌కి ఇన్‌స్టాగ్రామ్ షాక్ ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ని బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కన్‌ఫాం చేస్తూ.. నేను వేరే వ్యక్తిలా నటిస్తున్నానంటా, ఆ వ్యక్తి ఎవరో మరి అంటూ ట్వీట్‌లో తెలిపాడు.
కాగా, కరోనా వలన చిత్ర రిలీజ్‌కి బ్రేక్ పడగా, ఏడాది చివరలో మూవీ రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది. వింటేజ్ రొమాన్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. కాగా, ఈ ఫస్ట్ లుక్ ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉండటమే కాకుండా.. #RadheShyam హాష్‌ట్యాగ్‌తో 6.3 మిలియన్లకు పైగా ట్వీట్లు సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.