ఏలూరు: దేవరపల్లి మండలం దుద్దుకూరులో వైసీపీ వార్డు సభ్యుడు కాండ్రు రామకృష్ణ రెచ్చిపోయారు. సర్పంచ్ కుర్చీలో కూర్చొని దాదాగిరి చేశారు. దళిత మహిళ నాగమణి దుద్దుకూరు సర్పంచ్‌గా పని చేస్తున్నారు. అయితే ఆమె కుర్చీలో కూర్చుని లేవనంటే లేవనని వార్డు సభ్యుడు హంగామా చేశారు. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ హల్ చల్ చేశారు. ఇదేంటని ప్రశ్నించిన ఉప సర్పంచ్‌పై తిరగబడ్డారు. అంతేకాదు సర్దిచెప్పేందుకు వచ్చిన ఉద్యోగులను కూడా దుర్భాషలాడారు. వార్డు సభ్యుడు రామకృష్ణకి పంచాయతీ కార్యదర్శి చెప్పినా కూడా సర్పంచ్ కుర్చీలో నుంచి లేవలేదు. దీంతో రామకృష్ణ తీరుతో విసిగిపోయారు. కలెక్టర్‌కు ఉపసర్పంచ్ ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు.
సర్పంచ్ కుర్చీలో kurchoni వార్డు సభ్యుdi dadagiri : దళిత మహిళా సర్పంచ్‌కు అవమానం..
-