గుర్తు తెలియని దుండగులు ఈ వి రామసామి పెరియార్ విగ్రహానికి కుంకుమ రంగుతో పూసినట్లు గుర్తించారు. ఆయన దేవుళ్ళను వ్యతిరేకించే వారు. అలాంటి వ్యక్తి విగ్రహానికి ఇలా కుంకుమ పూయడం రాజకీయ ప్రకంపనలకు వేదికగా మారింది. ఈ రోజు తెల్లవారుజామున ఇనాంకులతుర్ లోని సమతువపురం కాలనీలోని విగ్రహం సమీపంలో ఒక స్లిప్పర్ కూడా దొరికిందని పోలీసులు తెలిపారు.
దీనిపై కేసు కూడా నమోదు చేసామని అధికారులు పేర్కొన్నారు. ఈ విధ్వంసాన్ని ఖండించిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం, ప్రమేయం ఉన్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ సహా ఇతర రాజకీయ నాయకులు ఈ సంఘటనను ఖండించారు. దిండిగల్ హైవేపై స్థానికులు కాసేపు ట్రాఫిక్ ను అడ్డుకున్నారు, విధ్వంసానికి నిరసన వ్యక్తం చేశారు.