చైనాలో కరోనా వ్యాక్సిన్ పేరుతో రోజురోజుకీ దారుణ ఘటనలు జరుగున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చైనాలో పలు సంస్థలు కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న కరోనా టీకాలను చైనాలో విచ్చలవిడిగా ప్రజలకు ఇస్తుండటం పై ప్రస్తుతం తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇలా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోని వ్యాక్సిన్లను లక్షల సంఖ్యలో ప్రజలకు ఇస్తున్న నేపథ్యంలో ఎంతో మంది పై దుష్ప్రభావాలు కూడా చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇలా డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం పై ఫిర్యాదు చేసినప్పటికీ ఎక్కడ ఈ వ్యవహారం మాత్రం ఆగడం లేదు అంటూ బాధితులు వాపోతున్నారు. కాగా ఇప్పటివరకు ఒక సంస్థ ఏకంగా 3.5 లక్షల మంది కి ఉన్న కరోనా వ్యాధి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎంతో మంది ప్రజలు దుష్ప్రభావం బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న ప్రజలు వాపోతున్నారు. మరికొన్ని సంస్థలు తమ ఉద్యోగులందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి అనే విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ తాము మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నియమాలను తు.చ తప్పకుండా పాటిస్తున్నాము అంటూ చెబుతున్నారు చైనా అధికారులు.