ఉపాస‌న కోసం చెఫ్‌గా మారిన స‌మంత‌

-

స్టార్ హీరో రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల నిత్యాం వార్త‌ల్లో నిలుస్తున్నారు. మూగ జీవాల ర‌క్ష‌ణ కోసం న‌డుంబిగించిన ఉపాస‌న అంద‌రు ఆరోగ్యంగా వుండాల‌ని స‌రికొత్త లైఫ్ స్టైల్‌ని అనుప‌రించాలనే స్ఫూర్తితో `యుఆర్‌లైఫ్` పేరుతో ఓ వెబ్ సైట్‌ని నిర్వ‌హిస్తున్నారు. ఈ వెబ్ సైట్‌కి స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేనిని అతిథి సంపాద‌కురాలిగా ఉపాస‌న ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఇందు కోసం ఇటీవ‌ల వ‌ర్క‌వుట్‌లు చేస్తూ ఆ ఫొటోల్ని ఇన్ స్టా వేదిక‌గా పంచుకోవ‌డం తెలివ‌సిందే. సామ్ వ‌ర్క‌వుట్‌ల‌కి సంబంధించిన ఫొటోలు తాజాగా వైరల్‌గా మారాయి. తాజాగా స‌మంత `యుఆర్‌లైఫ్‌` కోసం స్వ‌యంగా వంట చేయ‌డం ఆస‌ర‌క్తిక‌రంగా మారింది. ఉపాస కోసం `త‌క్క‌లి స‌దం` పేరుతో ఓ వంట కాన్ని చేసి చూపించింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తోంది. స‌మంత‌, ఉపాస‌న క‌లిసి వీడియోలో వంటి చేస్తూ సంద‌డి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version