ఏపీలో మరో దారుణం జరిగింది. ఏపీకి చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని దారుణంగా కొట్టి, కరెంట్ షాక్ పెట్టి ర్యాగింగ్ చేశారు సెకండ్ ఇయర్ విద్యార్థులు. పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ ర్యాగింగ్ చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై ఐదుగురు సెకండ్ ఇయర్ విద్యార్థులు దాడి చేశారు.

బీసీ హాస్టల్ లోకి తీసుకెళ్లి కొట్టి ,కరెంట్ షాక్ పెట్టి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ సెకండ్ ఇయర్ విద్యార్థులకు బయటి వ్యక్తి కూడా చేసాడు. విద్యార్థులందరూ మైనర్లే కావడం గమనార్హం. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని దారుణంగా కొట్టి, కరెంట్ షాక్ పెట్టి ర్యాగింగ్ చేసిన వీడియో బయటకు వచ్చింది. దింతో పల్నాడు జిల్లా దాచే పల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థిని దారుణంగా కొట్టి, హింసించిన ఐదుగురు సెకండ్ ఇయర్ విద్యార్థులపై యాక్షన్ తీసుకోనున్నారట.
ఏపీలో దారుణం
పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థిని దారుణంగా కొట్టి, హింసించిన ఐదుగురు సెకండ్ ఇయర్ విద్యార్థులు https://t.co/tcjmOpDFvN pic.twitter.com/GlEpnhz6UO
— Telugu Scribe (@TeluguScribe) August 9, 2025