ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు బిగ్ అలర్ట్. కొన్ని బస్సులలో ఉచిత ప్రయాణం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రాయాణం ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం ప్రారంభ సంగతి తెలిసిందే. పంద్రాగస్టు సందర్భంగా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఈ వేరు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.

అయితే ఈ పథకం కింద తిరుమల, పాడేరు అలాగే శ్రీశైలం లాంటి ప్రాంతాలకు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణం ఉండబోదని అధికారులు చెబుతున్నారట. నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సులలో కూడా ఫ్రీ జర్నీ ఉండదని అంటున్నారు. అలాగే కర్ణాటక తమిళనాడు తెలంగాణ మధ్య ఇంటర్ స్టేట్ ఎక్స్ప్రెస్ బస్సులలో కూడా ఉచిత ప్రయాణం ఉండబోదని సమాచారం. అయితే పైన పేర్కొన్న నిర్ణయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్.