చెన్నైలో ఒక ఒక పోలీస్ ఆఫీసర్ కుమార్తె చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే విద్యార్ధులకు కొరత ఉన్న టాబ్లెట్ లను కమీషనర్ కుమార్తె వెబ్ సైట్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తుంది. చెన్నై పోలీసు కమిషనర్ మహేష్ కుమార్ అగర్వాల్ కుమార్తె గునిషా అగర్వాల్… తన తల్లి పని మనిషి కుమార్తెకు వాడేసిన లాప్ టాప్ ఇవ్వడం చూసి తాను కూడా సహాయం చేయాలని భావించింది.
దీనితో ఆమె… ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌లు అవసరమైన విద్యార్థులకు సహాయం చేయడానికి ఆమె www.helpchennai.org అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు గునిషా నలుగురు విద్యార్థులకు వాటిని అందించింది. 20 ల్యాప్‌టాప్‌లతో సహా 25 పరికరాలను సేకరించింది. ఈ వారంలో 15 మంది విద్యార్థులు ఇప్పటివరకు పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె ఇంటర్ రెండో ఏడాది చదువుతుంది.
చెన్నైలో బి.కామ్ చదువుతున్న ఆటో డ్రైవర్ కుమార్తె సంగీతకు ఇలా ఒక టాబ్ ని అందించింది గునీష. అలాగే ఒక రెస్టారెంట్ వెయిటర్ కి కూడా ఆమె ఇలాగే అందించింది. సంగీత మాట్లాడుతూ… “టాబ్లెట్ చాలా ఉపయోగకరంగా ఉంది. గత సంవత్సరం ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ల్యాప్‌టాప్ క్రాష్ అయ్యింది. నేను బ్యాంకర్ కావాలనుకుంటున్నాను. టాబ్లెట్ కూడా దీనికి సిద్ధం కావడానికి నాకు సహాయపడుతుంది” అని పేర్కొంది.