ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ప్రాతిపదికగా సెకండియర్ రిజల్ట్స్ ?

-

కరోనా కేసులు పెరుగుతుండడంతో 10 వ తరగతి పరీక్షలు రద్దు చేసి, ఇంటర్ పరీక్షలు తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జూన్ ,జూలైలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహణ సాధ్యం కాకుంటే ప్రత్యామ్నాయాలు ఏమిటనే దాని పై ఇంటర్ బోర్డు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెకండ్ ఇయర్ లో ఉన్న వారు మొదటి సంవత్సరం పరీక్షలు రాశారు.. ఆ మార్క్స్ అందుబాటులో ఉన్నాయని, వీటిని ప్రాతిపదికన తీసుకొని విద్యార్థుల ఫలితాలు ప్రకటించే ఆప్షన్ ని బోర్డు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

మొదటి సంవత్సరం లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మినిమం పాస్ మార్కులు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇంటర్ బోర్డు ఆప్షన్ నచ్చక పోతే కరోనా తీవ్రత తగ్గాక పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి ని బట్టి ప్రభుత్వం కి ప్రతిపాదనలు.. విద్యా సంవత్సరం నష్ట పోకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ప్రాతిపదికగా తీసుకొని ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఆలోచనలో ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version