ఆస్ట్రేలియా చుట్టూ దీవులతో అందంగా ఉంటుంది. పూర్తిగా సముద్రంలోనే ఉన్న అతి పెద్ద దేశం.. ఆస్ట్రేలియానే. పురాతన ఖండం మాత్రమే కాదు.. ప్రపంచంలోనే ఆరో పెద్ద దేశం ఆస్ట్రేలియా. నిజానికి ఇది మనుషులు జీవించేదానికి అనుకూలం కాదు. కానీ 2.60 కోట్లమంది పైగా ఇక్కడ ఉంటున్నారు. ఈరోజు మనం ఈ ఖండం గురించి ప్రపంచం కన్నెరగని నిజాలు చాలా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
ఆస్ట్రేలియాలోని స్పినిఫెక్స్ గడ్డితో కండోమ్స్ తయారుచేస్తారు.
1979లో పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలో స్కైలాబ్ ముక్కలు పడ్డాయి.
పెప్పర్ స్ప్రేని వెంట తీసుకెళ్లిన ఓ మహిళకు ఆస్ట్రేలియాలో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది.
ఒకప్పుడు ఆస్ట్రేలియాలో వచ్చిన కార్చిచ్చు ఏకంగా 5వేల సంవత్సరాలకు పైగా కొనసాగింది.
ప్రపంచంలో ఎక్కువ కాలం బతికిన చేప ఆస్ట్రేలియా లంగ్‌ఫిష్ (Australian lungfish). 65 ఏళ్లు బతికింది.
ఆస్ట్రేలియాలో గంటకు చెల్లించే కనీస వేతనం రూ.1,550 ఆస్ట్రేలియాలోని ప్రతి 20 మందిలో ఒకరు కోటీశ్వరులు.
ఆస్ట్రేలియా ఎండిపోయిన ఎడారి లాంటి ఖండం అవడం వల్ల.. ఆ దేశ ప్రజలు మిగతా దేశాల ప్రజల కంటే ఎక్కువ నీటిని వాడుతున్నారు.
ఆస్ట్రేలియాలో 2010, 2011లో వచ్చిన వరదల వల్ల… ప్రపంచ సముద్ర మట్టాలు 7 మిల్లీమీటర్లు తగ్గాయి జేడీ (Jedi) అనేది ఆస్ట్రేలియాలో ఓ మతం. దాన్ని 70వేల మంది పాటిస్తున్నారు.
1859లో 24 కుందేళ్లను ఆస్ట్రేలియాలో వదిలారు. ఇప్పుడు ఏటా 20 లక్షల కుందేళ్లను చంపుతున్నారు. అవన్నీ ఆ 24 కుందేళ్లకి చెందినవేనట..
ఆస్ట్రేలియాలో నిరాశ అనే పర్వతం ఉంది. ఆపేరు ఎందుకు పెట్టారంటే… దాని పైకి ఎక్కాక చుట్టూ చూస్తే ఏమాత్రం ఆహ్లాదకరంగా ఉండదట.
విషపూరితమైన సాలీళ్లను వదిలేయడానికి ఆస్ట్రేలియాలో ప్రత్యేక కేంద్రాలున్నాయి. ఆస్ట్రేలియాలో ఈము పిజ్జా, మొసలి పిజ్జా ఆర్డర్ చేసుకోవచ్చు.
ఆస్ట్రేలియాలో మొత్తం 10వేలకు పైగా బీచ్‌లు ఉన్నాయి. మీరు రోజుకు ఒకటి చొప్పున చూస్తే.. మొత్తం చూసేందుకు 27 ఏళ్లు పడుతుందట..
ఆస్ట్రేలియన్ల ఇంగ్లీష్ భాష యాస.. యూరోపియన్ల యాసలాగా ఉండదు. కంటిన్యూగా మద్యం తాగడం వల్ల.. ఆస్ట్రేలియన్ల యాసలో తేడా వచ్చిందని అధ్యయనంలో తేలింది.