కరోనా వంటి విపత్కర సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా వ్యవహరించి చర్యలు తీసుకుంటున్నా.. బీజే పీ రాష్ట్ర చీఫ్.. సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వంపైనా, సీఎం జగన్‌పైనా కంపు విమర్శ లు చేస్తున్నారని సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. కాశీలో ఏపీ వాసులు చిక్కుకుపోయారు. వాళ్లని తీసుకు రావడానికి సీఎం జగన్ చొరవ చూపించడం లేదని మొసలు కన్నీళ్లు కారుస్తున్నారు కన్నా. ఏదైనా సమయా నికి అనుకూలంగా వ్యవహరించని నాయకుడు మట్టికొట్టుకుపోయిన సందర్భాలు బోలెడున్నాయి. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు కన్నాకు కూడా దాపురిస్తోందని ఈ విమర్శలపై ప్రతివిమర్శలు ఎక్కువయ్యాయి.
కాశీ ప్రాంతం ఉన్నది ఉత్తరప్రదేశ్‌లో. అక్కడ పాలన సాగిస్తున్న పార్టీ బీజేపీ. ఇక, కేంద్రంలో ఉన్నది కూడా బీజేపీనే. కాశీ నుంచి ఏపీవారిని ఇక్కడి తరలించే ప్రయత్నాలు చేయాల్సిందిగా అదే బీజేపీకి చెందిన ఏపీ నాయకుడిగా కన్నా అక్కడి సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు, పీఎం నరేంద్ర మోదీకి విన్నవించుకోకుండా.. ఏపీ లో రాజకీయ లబ్ధికోసం పాకులాడుతూ.. సీఎంపై పడి విమర్శలు చేయడం వల్ల వచ్చేది ఏమీ ఉండదని అంటున్నారు పరిశీలకులు. ఏదైనా నిజానికి సేవ చేయాలని, సాయం చేయాలని అంటే.. ఈ సమయంలో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం, ప్రజలకు ధైర్యం చెప్పడం లేదా జాగ్రత్తలు చెప్పడం వంటివి చేయాలి.
కానీ, వీటిని మానేసి.. రాష్ట్రంలోకి తెలంగాణ నుంచి వస్తానన్న వారిని రానివ్వట్లేదు. కాశీలో ఉన్నవారిని రానివ్వడం లేదని ఏడుపెందుకు? ఇప్పటికే ఎక్కడివారు అక్కడే ఉండాలని ఇదే బీజేపీకి చెందిన ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక, సీఎం జగన్ కూడా ఇదే పరిస్థితిని వివరిస్తున్నారు. ఒకరి నుంచి ఒక రికి వ్యాపించే కరోనా కట్టడికి ఎక్కడివారు అక్కడ ఉండడమే ప్రధాన ఔషధమని అందరూ చెబుతున్నా.. కన్నా మాత్రం కుళ్లు రాజకీయాలు చేస్తూ.. కరోనా సమయంలో విమర్శలు చేయడం ఆయన సీనియార్టీకి, ఆయన హుందాతనానికి(ఏమైనా ఉంటే) మంచిది కాదని సూచిస్తున్నారు. మరి ఇప్పటికైనా కన్నా మార తారా? లేదా? చూడాలి.