RRR ద్వారా రాజమౌళి సరికొత్త ప్రయోగం….??

-

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ మల్టి స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఆయా హీరోల ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్, కొమరం భీంగా నటిస్తున్న ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తో పాటు కోలీవుడ్ నటుడు సముద్రఖని,రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఇప్పటివరకు తన సినిమాల్లో ఎక్కువగా యాక్షన్ మరియు మాస్ ఎలివేషన్ సీన్స్ మీదనే దృష్టి పెట్టిన రాజమౌళి, ఈ సినిమా ద్వారా తనలోని మంచి రొమాంటిక్ యాంగిల్ ని కూడా ప్రేక్షకులకు చూపించబోతున్నారట. సినిమాలో హీరోలుగా నటిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరూ కూడా తమ హీరోయిన్స్ తో కలిసి పలు రొమాంటిక్ సీన్స్ లో దర్శనం ఇవ్వనున్నారట.

ఇప్పటికే చరణ్, ఆలియాల మధ్య అటుంవటి కొన్ని సీన్స్ తీసిన రాజమౌళి, అతి త్వరలో ఎన్టీఆర్ మరియు ఒలీవియాల మధ్య రానున్న సీన్స్ ని తెరకెక్కించబోతున్నారట. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, రాజమౌళి తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చడం జరిగింది. కాగా ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version