బిగ్‌బాస్ షోకు బిగ్ షాక్‌.. మ‌రి సీజ‌న్ 4 ఉంటుందా..?

-

బిగ్ బాస్‌.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ప్రపంచ టెలివిజన్ రంగంలో భారీ సక్సెస్ షో గా నిలిచిన ఈ బిగ్ బాస్ షో తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడం, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ తనదైన మార్క్‌ చూపిస్తోంది. ఇక ఇప్ప‌టికే తెలుగులో మూడు సీజ‌న్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్ షో.. నాలుగొవ సీజ‌న్ మొద‌లు పెట్టేందుకు రంగం సింద్ధం అవుతోంది. అయితే బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరించే రియాల్టీ షోకు ప్ర‌స్తుతం బిగ్ షాక్ త‌గిలిన‌ట్టు తెలుస్తోంది.

వాస్త‌వానికి బిగ్‌బాస్ షోలో పాల్గొన్న వారికి.. షో తరువాత కెరీర్ ట‌ర్న్ అవుతుంద‌ని భావిస్తారు. అందుకే ఈ షోలో ఆడేందుకు తెగ ఉత్సాహ‌ప‌డ‌తారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో అలానే జ‌రుగుతుంది. అయితే తెలుగులో మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హారం న‌డుస్తుంది. ఇక్క‌డ బిగ్‌బాస్ షోలో పాల్గొన్న త‌ర్వాత ఏ కంటిస్టెంట్ కెరీర్ ట‌ర్న్ అవ్వ‌లేదు. క‌నీసం మూడు సీజ‌న్స్ విన్న‌ర్లు అయిన శివబాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్‌ల ప‌రిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు బిగ్‌బాస్ సీజ‌న్ 4లో పాల్గొనేందుకు ఎవ‌రూ సుముక‌త వ్య‌క్తం చేయ‌డం లేదుట‌. నిర్వాహకులు ఫోన్లు చేస్తున్నా వారు పట్టించుకోవడం లేదట. ఎక్కువ రెమ్యునరేషన్‌ ఇస్తామని చెప్పినా ఈ షోలో పాల్గొనేందుకు వారు ఆసక్తిని చూపడం లేదన్నది స‌మాచారం. మ‌రి ఇలా అయితే బిగ్‌బాస్ సీజ‌న్ 4 ఉంటుందా అన్న అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. అయితే నిర్వాకులు మాత్రం సింగర్లు, సెకండరీ గ్రేడ్ నటులను అయినా తీసుకురావాలని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news