International men’s day 2022:పురుషుల గురించి వారికే తెలియని కొన్ని విషయాలు..!!

-

చిల్డ్రన్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఉమెన్స్ డే లాగే మెన్స్ డే అనేది ఒకటి ఉందని ఎవ్వరికి తెలియదు.కానీ పురుషుల కోసమూ ఒక రోజు కేటాయించారు. మగాళ్ల కోసం ఒక రోజు ఎందుకు అని అనుకుంటున్నారా.. వారి ఆరోగ్యం కోసం.. ప్రపంచంలో విజయాల్ని సాధించిన మగవారి విజయగాధాలతో స్ఫూర్తిని నింపడం కోసం అంతే కాకుండా క్షేమకరమైన సమాజ స్థాపన కోసం ప్రతి సంవత్సరం నవంబర్ 19 వ తేదీని ప్రపంచ పురుషుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

1992లో థామస్ ఓస్టెర్ అనే అయన పురుషుల కోసం ప్రతేకంగా ఒక రోజు కేటాయించాలని ప్రతిపాదించి.. నిర్వహించారు. అయితే, అనేక కారణాల తర్వాత దానిని ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరికి 1999లో  ట్రినిడాడ్ కు చెందిన డాక్టర్ జెరోమ్ టీలూక్సింగ్  తిరిగి పురుషుల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలని దానిని కొనసాగించడం మొదలు పెట్టాడు. ఇది అప్పట్నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం మగాళ్ల రోజుకు ఓ ప్రత్యేక థీమ్ పెట్టుకుంటున్నారు.

ప్రపంచ పురుషుల దినోత్సవంతో పాటు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కూడా ఉంది. అవును, అవి వేర్వేరు సెలవులు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కూడా నవంబర్‌లో జరుపుకుంటారు, అయితే, ఈ సందర్భంలో,  వైద్యం, కుటుంబ చట్టం, విద్య రంగంలో పురుషుల పట్ల వివక్ష చూపడం పట్ల సమాజం దృష్టిని ఆకర్షించడం.దీని ప్రయోజనం కోసం అత్యంత ముఖ్యమైన పురుష విజయాలను ప్రదర్శించడం.ఈరోజు ఒక ప్రత్యేకం అని చెప్పాలి..

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ప్రాథమిక లక్ష్యాలు..

  • ఆదర్శ పురుషుల గురించి ప్రత్యేకించి తెలుపటం.
  • కేవలం సినిమా తారలనో, క్రీడాకారులనో మాత్రమే కాక, దైనందిన జీవితంలో కాయకష్టం చేసుకునైనా సరే గౌరవప్రదమైన నిజాయితీపరమైన జీవితాలు గడిపేవారి గురించి కూడా చెప్పటం.
  • సంఘానికి, వర్గానికి, కుటుంబానికి, వైవాహిక వ్యవస్థకు, శిశు సంరక్షణకు , పర్యావరణకు పురుషులు ఒనగూర్చిన ప్రయోజనాలను గుర్తించటం.
  • పురుషుల సాంఘిక, భావోద్వేగ, శారీరక , ఆధ్యాత్మిక ఆరోగ్యంపై దృష్టి సారించటం.
  • సాంఘిక సేవలలో, విలువలలో, అంచనాలలో , చట్టాలలో పురుషులేదుర్కొంటూన్న వివక్షను చాటటం.
  • హాని గురించిన తలంపులు లేని, పరిపూర్ణ అభివృద్ధికి అవకాశాన్నిచ్చే సురక్షితమైన ప్రపంచం రూపొందించటానికి కృషి చేయటం.
  • స్త్రీ-పురుషుల మధ్యన సఖ్యత, సరైన సంబంధాలను నెలకొల్పటం..లింగ సమానత్వాన్ని వ్యాపింపజేయటం.

19 నవంబరున ఈ ఉత్సవాన్ని 70కి పైగా దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version