బంగారు గనిలో ప్రమాదం.. 11 మంది దుర్మరణం

-

ఇండోనేషియా, సులవేసి ద్వీపంలోని ఓ బంగారు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గనిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 11 మంది కార్మికులు మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. అయితే ఇండోనేషియాలో ఇటువంటి అనధికార మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహించడం సర్వసాధారణంగా మారిందని అధికారులు తెలిపారు.

అంతర్జాతీయ వార్తా సంస్థల కథనం ప్రకారం : “గోరంటాలో ప్రావిన్స్‌లోని రిమోట్ బోన్ బొలాంగో ప్రాంతంలో కొందరు బంగారు గనిని అక్రమంగా నిర్వహిస్తుండగా ఆదివారం రోజున సుమారు 33 మంది గ్రామస్థులు బంగారు గనిలో పనులు చేయడానికి వెళ్లారు. కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా భారీగా వాన పడింది. కార్మికులంతా గనిలో పని చేస్తుండగా కొండ చరియలు ఒక్కసారిగా విరిగి వారిపై పడ్డాయి. ఈ ఘటనలో 11 మంది కార్మికులు ప్రాణాలు విడిచారు.” అని గోరంటా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి అఫీఫుద్దీన్ ఇలాహుడే తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version