చిన్న పిల్లలకు అరుదైన వ్యాది…!

-

ఒక పక్క కరోనాతోనే జనాలు చస్తున్న వేళ ఇప్పుడు కొన్ని కొన్ని వార్తలు మరింతగా కలవరపెడుతున్నాయి. ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఇప్పుడు కొత్త భయంతో కంటి మీద కునుకు లేకుండా బ్రతుకుతున్నాయి. కరోనా ఎక్కువగా ఉన్న దేశాల్లో చిన్న పిల్లలకు అంతుబట్టని వ్యాధులు వస్తున్నాయి. బ్రిటన్‌లో ఇలాంటి కేసులు ఇటీవల చాలా బయటపడ్డాయి. అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది.

15 మంది పిల్లలకు వింత రోగం వచ్చిందని అధికారులు చెప్పారు. ‘మిస్టీరియస్‌ సిండ్రోమ్‌’గా దీనిని వైద్యులు చెప్తున్నారు. ఇది ఏంటీ అనేది వైద్యులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. కొన్ని ఐరోపా దేశాల్లో కూడా ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో చాలానే బయటపడుతున్నాయి. దీనిపై ఇప్పుడు వైద్యులు కీలక సూచనలు చేస్తున్నారు. ప్రజలు దీని విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు.

2-15 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఇలాంటి వ్యాధులు వస్తున్నాయని… అరుదుగా కనిపించే – ధమనులు సహా రక్తనాళాల్లో వాపుతో పాటుగా కడుపు నొప్పి తీవ్రంగా ఉండటం. వాంతులు వంటివి రావడం జరుగుతున్నాయని అంటున్నారు. దీనికి కరోనాకు పూర్తిగా సంబంధం ఉంది అని చెప్పలేమని కాని దగ్గరి సంబంధాలు ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. దీనిపై ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news