అమెరికా ఎన్నికలు.. డెమోక్రటిక్‌ ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్‌ వాల్జ్

-

అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా భారత, ఆఫ్రికన్ సంతతి కమలా హారిస్ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె తన ఉపాధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకున్నారు. డెమోక్రాటిక్ పార్టీ తరఫున వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమల మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను ఎంపిక చేశారు. 60 ఏళ్ల వాల్జ్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకోవడంలో, హారిస్ తన ప్రచారాన్ని ఎగువ మిడ్‌ వెస్ట్‌లో బలపరచాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. అమెరికా అధ్యక్ష రాజకీయాల్లో ఎగువ మిడ్‌ వెస్ట్ను కీలకమైన ప్రాంతంగా భావిస్తారు.

ఇక టిమ్ వాల్జ్ విషయానికి వస్తే.. ఆయన నెబ్రాస్కా రాష్ట్రంలోని వెస్ట్ పాయింట్ అనే పట్టణంలో జన్మించారు. 24 ఏళ్లపాటు మిలిటరీలో సేవలందించిన టిమ్.. 2006 నుంచి డెమొక్రాటిక్ పార్టీ తరఫున పని చేస్తున్నారు. 2018లో “వన్ మిన్నెసోటా” థీమ్‌పై గవర్నర్‌గా పోటీ చేసి గెలిచారు. 2022లో మరోసారి గవర్నర్‌గా ఎన్నికయ్యారు. మిన్నెసోటాలో డెమోక్రటిక్ అజెండాను రూపొందించడంలో వాల్జ్ కీలకంగా వ్యవహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news