US క్యాపిటల్‌ సెనేట్‌ భవనాల్లో అగంతకుడు.. పోలీసుల తీవ్ర గాలింపు

-

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ సెనేట్‌ భవనాల్లోకి ఆయుధాలు కలిగి ఉన్న ఓ అగంతకుడు ప్రవేశించాడన్న వార్తలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వార్త స్థానికంగా కలకలం రేపడంతో అప్రమత్తమైన పోలీసులు సెనేట్ కార్యాలయాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ అగంతకుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. రస్సెల్‌ సెనేట్‌ భవనం, ఇతర సెనెట్‌ భవనాల్లో క్షుణ్నంగా వెతికిన తర్వాత.. అలాంటి వ్యక్తి ఎవరూ లేరని నిర్ధారణకు వచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సంఘటన అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నాం 2.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆయుధాలు కలిగి ఉన్న ఓ వ్యక్తి క్యాపిటల్‌ సెనేట్‌ భవనాల్లో సంచరిస్తున్నట్లు 911కి ఫోన్‌ చేసి ఎవరో సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడున్నవారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. కొందరిని బయటకు తీసుకొచ్చారు. అయితే ఫోన్‌ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news