ఇండియా రివర్స్ ఎటాక్..నిమిషాల్లోనే పాకిస్తాన్ డ్రోన్స్ ధ్వంసం అయ్యాయి. నిమిషాల్లోనే పాకిస్తాన్ డ్రోన్లన్నింటినీ భారత సైన్యం ధ్వంసం చేసింది. పాకిస్థాన్ మళ్లీ కాల్పులు ప్రారంభించింది. ఓ వైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాక్. శ్రీ నగర్, జమ్మూ, ఉదంపూర్, RS పురా, అక్నూర్, చాంబ్, బింబర్ ప్రాంతాల్లో మోర్టార్ షెల్స్‌తో దాడులు చేస్తోంది పాకిస్థాన్.

మరోవైపు, శ్రీనగర్‌లో బ్లాక్ ఔట్ కొనసాగుతోంది. సీజ్ ఫైర్ ఒప్పందం ఏమైందని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఘాటు ట్వీట్ చేశారు. సీజ్‌ఫైర్‌కు తూట్లు పొడుస్తూ పాకిస్థాన్ మరోసారి భారత్‌పై దాడులకు పాల్పడటంతో..జమ్ముకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్‌ఔట్ విధించారు అధికారులు. ఇక అటు నిమిషాల్లోనే పాకిస్తాన్ డ్రోన్లన్నింటినీ భారత సైన్యం ధ్వంసం చేసింది.