పాక్ కాల్పుల్లో మరో భారత్ అధికారి మృతి చెందాడు. సరిహద్దులో జరిగిన కాల్పులలో.. బీఎస్ఎఫ్ ఎస్సై వీర మరణం పొందారు. జమ్మూలోని ఆర్ఎస్ పుర ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దులో కాల్పులు జరిగాయి. జమ్మూలోని ఆర్ఎస్ పురా ప్రాంతంలోని సరిహద్దు వద్ద పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో బిఎస్ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎండి ఇంత్యాజ్ మృతి చెందారు.

సరిహద్దు ఔట్ పోస్టుకు నేతృత్వం వహించారు ఇంతియాజ్. ఇక జమ్మూలోని ఆర్ఎస్ పురా ప్రాంతంలోని సరిహద్దు వద్ద పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన బిఎస్ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎండి ఇంత్యాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది బీఎస్ఎఫ్.