CM Omar Abdullah is extremely angry in the wake of Pakistan’s attacks: పాకిస్థాన్ దాడుల నేపథ్యంలో.. సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజ్‌ఫైర్ ఏమైంది.. శ్రీనగర్‌లో మళ్లీ బాంబు పేలుళ్లు వినిపించాయన్నారు. శ్రీనగర్‌లో ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ ఒక్కసారిగా తెరుచుకున్నాయని పేర్కొన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా.

ఇది సీజ్‌ఫైర్ కానే కాదంటూ.. వీడియో షేర్ చేసిన ఒమర్ అబ్దుల్లా.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు పాకిస్థాన్ దొంగ దెబ్బ. మళ్లీ కాల్పులు ప్రారంభించింది పాకిస్థాన్. ఓ వైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాక్. శ్రీ నగర్, జమ్మూ, ఉదంపూర్, RS పురా, అక్నూర్, చాంబ్, బింబర్ ప్రాంతాల్లో మోర్టార్ షెల్స్‌తో దాడులు చేస్తోంది పాకిస్థాన్. మరోవైపు, శ్రీనగర్‌లో బ్లాక్ ఔట్ కొనసాగుతోంది. సీజ్ ఫైర్ ఒప్పందం ఏమైందని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఘాటు ట్వీట్ చేశారు.