అమెరికాలో19 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణకు సర్వం సిద్ధం

-

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జాతికి చేసిన సేవలకు గుర్తుగా ఇప్పటికే భారత్​లో చాలాచోట్ల ఎత్తైన విగ్రహాలున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే తెలంగాణ సర్కార్ ప్రపంచంలో ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయనకు ఘన నివాళి అర్పించడమే కాకుండా.. ఆయన జీవితం గురించి.. రాబోయే తరాలు తెలుసుకునేలా చేసింది. అయితే అంబేడ్కర్​ విగ్రహాలు భారత్​లోనే కాకుండా ప్రపంచంలో పలు దేశాల్లో కూడా ఉన్నాయి.

ఇక ఇప్పుడు అంబేడ్కర్ విగ్రహం అమెరికాలో కూడా ఆవిష్కృతం కాబోతోంది. ఆయన సిద్ధాంతాలు ప్రతిబింబించేలా 19 అడుగుల విగ్రహాన్ని అగ్రరాజ్యంలో రూపొందించారు. మేరీల్యాండ్‌లోని అకోకీక్‌ నగరంలో 13 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్ (AIC)లో భాగంగా ఈ విగ్రహాన్ని నిర్మించారు. అంబేడ్కర్‌ బోధనలు, సిద్ధాంతాలను వ్యాప్తి చేసే ఉద్దేశంతో ఈ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. సమానత్వం, మానవ హక్కులకు చిహ్నంగా దీన్ని చూస్తున్నట్లు ఏఐసీ వెల్లడించింది. ‘‘స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’’గా నామకరణం చేసిన ఈ విగ్రహాన్ని అక్టోబరు 14వ తేదీన ఆవిష్కరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version