అధ్యక్ష్య కాలం ముగిసిన తర్వాత అమెరికా ఇచ్చే గౌరవం..

-

ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షుడికి లేనంత పాపులారిటీ అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. దానికి కారణం ప్రపంచ దేశాల్లో అమెరికా అగ్రగామిగా ఉండడమే. అందుకే అమెరికాతో స్నేహం చేయాలని, వ్యాపారం భాగస్వామ్యం కుదుర్చుకోవాలని ప్రతీ ఒక్కరు ఆసక్తి చూపిస్తుంటారు. ఐతే ఎప్పుడూ లేనంత ఇంట్రెస్టింగ్ గా ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. కోవిడ్ విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక న్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పై డెమోక్రాటిక్ పార్టి అభ్యర్థి జో బైడెన్ గెలుపొంది అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు.

ఐతే నిన్నటి వరకూ అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ వైట్ హౌస్ ని వీడాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో తమ అధ్యక్షులకి అమెరికా ఇస్తున్న గౌరవం తెలుసుకోవాలి. అధ్యక్ష పదవీ కాలం ముగిసిన తర్వాత సంవత్సరానికి 1.6కోట్ల పెన్షన్ ఇస్తుందట అమెరికా ప్రభుత్వం. అదే కాకుండా వైట్ హౌస్ నుండి బయటకి వెళ్ళాక మరో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తుందట. ఇన్యూరెన్స్ తో పాటు సెక్యూరిటీ కూడా ఇస్తుందట. అధ్యక్షుడి భార్యకి కూడా 20వేల డాలర్లు కూడా పెన్షన్ రూపంలో ఇస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version