అగ్రరాజ్యం అమెరికా 50 ఏళ్ల తర్వాత తొలిసారి చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపేందుకు ప్రయత్నించింది. అయితే ఆ దేశంలోని పిట్స్బర్గ్కు చెందిన ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ అనే ప్రైవేటు సంస్థ చేపట్టిన ఈ ప్రయోగం సందిగ్ధంలో పడింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ స్పేస్ స్టేషన్ నుంచి ల్యాండర్‌ను పంపగా లాంఛింగ్ అయిన గంటలకే స్పేస్‌క్రాఫ్ట్‌లో ఇంధన లీకేజీ లోపం బయటపడింది. ఈ ల్యాండర్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో వైఫల్యాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రొఫల్సన్ సిస్టమ్‌లో లోపం ఉంటే చంద్రుడిపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసే సామర్థ్యం కోల్పోతుందని అంటున్నారు.
ప్రయోగం జరిగిన 7 గంటల తర్వాత ల్యాండర్‌ను సూర్యుడి దిశగా తిరిగేలా చేయగా.. ల్యాండర్‌కు కావాల్సిన శక్తి సోలార్ ప్యానెల్ ద్వారా స్వీకరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీన జాబిల్లిపై ల్యాండర్ దిగాల్సి ఉండగా.. చాలా వరకు ఇంధనం వృథా అయిన నేపథ్యంలో ల్యాండింగ్‌పై ఆశలు సన్నగిల్లాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మిషన్ లక్ష్యాలను సవరించుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయగలమనే విషయంపై అంచనా వేసుకుంటున్నట్లు వెల్లడించారు.