ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో… ప్రత్యర్థి పాకిస్తాన్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ దేశంలో తీవ్ర ఇంధన కొరత నెలకొంది. ఇస్లామాబాదులో ఈ సమస్య మరింత పెరిగిపోయింది. ఇస్లామాబాద్ లో రాబోయే 48 గంటల పాటు అన్ని పెట్రోల్ బంకులు కూడా మూసి వేయబోతున్నట్లు ప్రకటన చేస్తున్నారు.

దీంతో పెట్రోల్ బంకులకు క్యూ లైన్ కట్టారు వాహనదారులు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. పాకిస్తాన్ కు ఎలాంటి సరఫరా జరగడం లేదు. అందుకే ఈ పరిస్థితి నెలకొంది.