భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న తరుణంలో దేశానికి సంఘీభావంగా భారతీయులు అండగా నిలుస్తున్నారు. త్రివర్ణ పతాకంతో రోడ్ల మీదకు వచ్చి జాతీయ సమైక్యతను దేశ పౌరులు చాటుతున్నారు. ఈ క్రమంలోనే మొన్న సీఎం రేవంత్ రెడ్డి, నిన్న జాగృతి అధ్వర్యంలో సైన్యానికి సంఘీభావంగా ర్యాలీలు నిర్వహించిన విషయం తెలిసిందే.
తాజాగా మేడ్చల్ జిల్లా పరిధిలోని మల్లారెడ్డి కాలేజీలో భారత సైన్యానికి మద్దతుగా విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు సంఘీభావ ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన సంఘీభావ సభలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానందలు పాల్గొన్నారు. జాతీయ జెండాను చేతిలో బట్టుకుని హరీశ్ రావు, మల్లారెడ్డి ఆర్మీకి మద్దతుగా నినాదాలు చేశారు.