అలా జరిగితే బంగ్లాదేశ్ కు పాక్ గతే పడుతుంది : హసీనా కుమారుడు

-

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా, ఆ తర్వాత అ దేశంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై తాజాగా హసీనా కుమారుడు సాజీద్‌ వాజెద్‌ జాయ్‌ స్పందించారు. ఈ క్రమంలో సైన్యానికి కీలక సూచన చేస్తూ.. ఎన్నిక కానీ ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారం అప్పగించవద్దని అన్నారు. ఇది సైన్యం బాధ్యత అని తెలిపారు. ప్రజాస్వామ్యంగా ఎన్నిక కానీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే .. బంగ్లాదేశ్‌ కూడా మరో పాకిస్థాన్‌ అవుతుందని ఫలితంగా 15 ఏళ్లలో దేశం సాధించిన ప్రగతి నాశనం అవుతుందని హెచ్చరించారు. బంగ్లాదేశ్‌లో ఇంకా జరుగుతున్న ఆందోళనలను అమెరికాలో ఉన్న సాజీద్ వాజెద్ తీవ్రంగా ఖండించారు. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్న హింసను ఉగ్రవాదంగా అభివర్ణించారు.

“నా తల్లి హసీనా అసలు దేశాన్ని వీడాలనుకోలేదు. ఆమె భద్రతను దృష్టిలో ఉంచుకొని మేము ఒత్తిడి చేయడం వల్లే చివరకు అంగీకరించారు. బంగ్లాను అభివృద్ధి చెందిన దేశంగా చూడడం ఆమె కల. దానికోసమే 15 ఏళ్లుగా పోరాడుతున్నారు. చివరకు ఇలా జరగడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు.” అని సాజీద్ వాపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news