మసీదులో భారీ పేలుడు.. 18 మంది మృతి

-

అఫ్గానిస్థాన్​ లో ఘోరం చోటు చేసుకుంది. హెరాత్​లోని ఓ మసీదులో భారీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో బాంబు పేలుళ్లు జరిగాయి. ప్రముఖ మతగురువు కూడా చనిపోయినట్లు సమాచారం. క్షతగాత్రులను హెరాత్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తాలిబన్​ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

గత రెండు దశాబ్దాలుగా మజీబ్​ ఉల్​ రెహమాన్​ అన్సారీ అనే మత గురువు అఫ్గానిస్థాన్​ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందున అతన్ని చంపడానికే ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తాలిబన్​ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ దాడిలో మత గురువు అన్సారీ మరణించినట్లు తాలిబన్​ అధికారి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అఫ్గానిస్థాన్​ అంతర్గత వ్యవహారాల మంత్రి తెలిపారు. తాలిబన్​లు అఫ్గానిస్థాన్​లో అధికారం చేపట్టినప్పటి నుంచి.. ఇస్లామిక్​ దేశంలో షియా ముస్లింలను టార్గెట్​ చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news