వాగ్నర్‌ గ్రూపును ఉగ్రసంస్థగా ప్రకటించనున్న బ్రిటన్‌

-

రష్యా కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించాలనే యోచనలో ఉంది యూకే. అదే జరిగితే యూకే చట్ట ప్రకారం వాగ్నర్‌లో చేరడం, దానికి మద్దతు ఇవ్వడం చట్ట విరుద్ధం అవుతుంది. పార్లమెంట్‌లో దీనికి ఆమోద ముద్ర పడితే బ్రిటన్‌ పరిధిలోని వాగ్నర్‌ ఆస్తులను సీజ్‌ చేయడానికి అవకాశం లభిస్తుంది.

వాగ్నర్‌ సంస్థ అత్యంత హింసాత్మక, వినాశకర పుతిన్‌ ఆయుధం అని బ్రిటన్‌ హోంశాఖ మంత్రి సుయేలా బ్రేవర్మన్‌ అన్నారు. ఉక్రెయిన్‌, ఆఫ్రికా సంక్షోభాలు ప్రపంచానికి ముప్పుగా మారుతున్నాయని.. క్రెమ్లిన్‌ రాజకీయ లక్ష్యాలను పూర్తి చేసేందుకు వాగ్నర్‌ గ్రూపు నిరంతరం ప్రభుత్వాలను అస్థిరపర్చే కార్యక్రమాలు కొనసాగిస్తోందని తెలిపారు. వారు ఉగ్రవాదులని సింపుల్‌గా చెప్పొచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

తాజా బిల్లుతో బ్రిటన్‌ చట్టాల్లో ఉగ్ర సంస్థలుగా ఉన్న హమాస్‌, బొకోహరాం వంటి వాటి సరసన వాగ్నర్‌ పేరు కూడా చేరనుంది. ఆ దేశంలోని టెర్రరిజమ్‌ యాక్ట్‌ 2000 ప్రకారం హోం మంత్రి ఏదైనా సంస్థ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతోందని భావిస్తే.. దానిని ఈ చట్టంలో చేర్చవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news