ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అకస్మాత్తుగా హైవే పై నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. మెక్సికోలోని నయరిట్ రాష్ట్రంలో స్థానిక కాలమాన ప్రకారం గురువారం తెల్లవారుజామున జరిగిందీ దుర్ఘటన. అటుగా వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిన వారి రక్షించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరణించిన 17 మంది వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
’40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు హైవే పై నుంచి లోయలోకి పడిపోయింది.. మాకు సమాచారం రాగానే అక్కడికి వెంటనే చేరుకున్నాం. లోయలో పడిన వారిని కాపాడాం. కానీ చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. 50 మీటర్ల లోతున్న లోయలో బస్సు పడిపోవడం వల్ల రెస్య్కూ ఆపరేషన్ కష్టమైంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నాం.’ అని స్థానిక అధికారులు తెలిపారు.