కెనడా కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి సిగరెట్‌పైనా వార్నింగ్‌

-

మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. అని ఏకంగా మద్యం బాటిళ్లు, సిగరెట్ ప్యాకెట్లపై రాసి ఉన్నా వాటికి బానిసైన వారు అదేం పట్టించుకోకుండా ఎడాపెడా తాగేస్తుంటారు. చివరకు అనారోగ్యం బారిన పడి జీవితాలు నాశనం చేసుకుంటారు. ముఖ్యంగా పొగరాయుళ్లు వారి ఆరోగ్యమే కాకుండా వారి చుట్టు పక్కల ఉన్న వారి ఆరోగ్యం కూడా పాడుచేస్తుంటారు.

పొగరాయుళ్లకు అరోగ్యం విషయంలో అవగాహన కల్పించే దిశగా ఇప్పటికే చాలా ప్రభుత్వాలు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాయి. అయినా షరామామూలే. ఇప్పుడు తాజాగా కెనడా సర్కార్​ కూడా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం సిగరెట్‌ ప్యాకెట్‌పైనే కాకుండా.. ఇక నుంచి అమ్మకం జరిపే ప్రతి సిగరెట్‌పై వార్నింగ్‌ లేబుల్‌ ముద్రణ ఉండాలంటూ తాజాగా ఆదేశాలు జారీచేసింది.

సిగరెట్‌పై ‘సిగరెట్స్‌ కాజెస్‌ ఇంపోటెన్స్‌ అండ్‌ క్యాన్సర్‌ (సిగరెట్ల వలన నపుంసకత్వం, క్యాన్సర్‌ వస్తుంది)’ పాయిజన్‌ ఇన్‌ ఎవిరీ పఫ్‌(పీల్చే ప్రతి దమ్ములో విషం ఉంటుంది)’ అనే హెచ్చరికలు ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version