నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్‌

-

ఖ‌లిస్తానీ ఉగ్రవాది హ‌ర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడిని కెనడా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా ఈ కేసులో నాలుగో అరెస్టు చేశారు. తాజాగా శనివారం అమన్‌దీప్‌ సింగ్‌ అనే 22 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసిన‌ట్లు అధికారులు వెల్లడించారు. బ్రాంప్టన్‌లో నివసిస్తున్న అమన్‌దీప్‌.. ఆయుధాలకు సంబంధించిన కేసులో అంటారియో పోలీసుల కస్టడీలో ఉన్నాడని, అతడిని తమ అదుపులోకి తీసుకున్నామని ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ ఇన్‌చార్జి మన్‌దీప్‌ మూకర్‌ తెలిపారు.

హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ గతేడాది కెనడాలో హత్యకు గురైన విషయం తెలిసిందే.  ఈ కేసులో కరణ్‌ బ్రార్‌, కమల్‌ప్రీత్‌ సింగ్‌, కరణ్‌ప్రీత్‌ సింగ్‌లను పోలీసులు గత వారం అరెస్టు చేశారు. నిజ్జర్ హ‌త్య త‌ర్వాత భార‌త్, కెన‌డా మ‌ధ్య దౌత్య సంబంధాలు బ‌ల‌హీన‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. నిజ్జర్ మ‌ర్డర్ వెనుక భార‌తీయ ఏజెంట్లు ఉన్నట్లు కెన‌డా ప్రధాని ట్రూడో ఆరోపించారు. కానీ ఆ ఆరోప‌ణ‌ల‌ను భార‌త్ ఖండించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version