మల్కాజ్‌గిరి రాజేంద్రుడిదే…ఓటర్ల మద్దతు ఆయనకే

-

మినీ ఇండియా …మల్కాజిగిరిలో గెలుపు ఎవరిది అని తెలంగాణలో చర్చలు జరుగుతున్నాయి.భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ బరిలో ఉండగా వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డిని కాంగ్రెస్ రంగంలోకి దింపింది.ఇక బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని పోటీలో నిలిపారు.ఇక్కడ ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ నడుస్తోంది. రేవంత్‌రెడ్డి గెలిచి ఐదు నెలలు అయినా మల్కాజ్‌గిరికి చేసింది ఏమీ లేదు. అందుకే ఈసారి ప్రజలు ఈటల రాజేందర్‌ని నమ్ముతున్నారు. గతంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన కోవిడ్ సమయంలో విశేష సేవలు అందించారు.ఆ తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయంగా ఈటేలను ఎన్నిరకాలుగా వేధించారో ప్రజలందరూ చూసారు.అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే ఆయనకు ఇప్పుడు అందరూ మద్దతు ఇస్తున్నారు. మల్కాజ్‌గిరిలో రాజేంద్రుడికి పట్టం కట్టి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మూడో దఫా కొలువుతీరనున్న కేంద్ర ప్రభుత్వంలో భాగం కావాలని ఓటర్లు కోరుకుంటున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అయితే కాంగ్రెస్ ఆశలు ఆవిరికావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎంపీగా ఈ నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదు. అందుకే రేవంత్‌రెడ్డికి మల్కాజ్‌గిరి ప్రజలు కాంగ్రెస్ ఓటమిని రిటర్న్ గిఫ్ట్‌గా ఇవ్వాలని భావిస్తున్నారు.2023 ఎన్నికల్లో దారుణ ఓటమి ద్వారా సంక్షోభాన్ని బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది.ఈ పార్లమెంటు పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలనూ గెలుచుకున్న ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఉనికి చాటుకోవడానికి తాపత్రయ పడుతోంది తప్ప గెలుపుకోసం కాదు అనేది అందరికీ తెలిసిందే.

మల్కాజ్‌గిరి లోక్‌సభ సీటులో బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ దే గెలుపని దాదాపు అన్ని సర్వేలు తేల్చేశాయి.ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ బంపర్ మెజార్టీతో గెలవబోతున్నట్లు స్పష్టం చేశాయి.మల్కాజ్‌గిరిలో భారతీయ జనతాపార్టీకి 46.79 శాతం ఓటు షేరు రానుందని సర్వేలు వెల్లడించాయి.ఆయా సర్వేల్లో ఈటెలకు 61.1 శాతం, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్‌రెడ్డికి 24.6 శాతం, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి 13.1 శాతం మంది ఓటర్లు మద్దతుగా నిలిచారు.ఇక 63 శాతం మంది పురుష ఓటర్లు, 54 శాతం మంది మహిళా ఓటర్లు ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉన్నట్లు ఈ సర్వేల్లో వెల్లడైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version