గాల్వాన్ లో ఉద్రిక్త పరిస్థితుల తర్వాత భారత్ ఇచ్చిన షాక్ కు చైనా తేరుకోక ముందే మరో డిజిటల్ షాక్ కు గురైంది. దిగ్గజ మొబైల్ సంస్థ ఆపిల్ చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. చైనా కు సంబంధించిన 59 యాప్స్ పై నిషేధం విధించడంతో చైనా కంపెనీలు పెద్ద ఎత్తున నష్టం చవిచూశాయి. అయితే ఈ షాక్ నుండి ఇంకా బయటకు రాకముందే ఆపిల్ కంపెనీ చైనాకు గట్టి షాక్ ఇచ్చింది.
తాజాగా యాపిల్ సంస్థ చైనీస్ యాప్ స్టోర్ నుండి ఏకంగా 4500 మొబైల్ గేమ్స్ ను తొలగించడంతో చైనా దేశం ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ముఖ్యంగా ఆపిల్ సంస్థ మొబైల్ గేమింగ్ లైసెన్స్ నిబంధనల్లో పలు సంస్కరణలు చేప్పట్టే భాగంగా చైనా గేమ్స్ ను తొలగించింది. చట్ట పరంగా సరైన అనుమతులు లేని గేమ్స్ ను ఎట్టి పరిస్థితుల్లో తాము ఉంచమని తేల్చి చెప్పడంతో ఏకంగా 4500 గేమ్స్ ను తొలగించడం జరిగింది. అయితే తొలగించిన గేమ్ యాప్స్ ను నిబంధనలకు తగ్గట్టు యాప్ లైసెన్స్ లను పునరుద్ధరించిన తర్వాత అప్లోడ్ చేసుకోవచ్చని ఆపిల్ సంస్థ తెలియజేసింది. ఈ దెబ్బతో చైనా సంస్థలకు భారీ నష్టం వాటిల్లుతుందని నిపుణులు తెలుపుతున్నారు.