బీ అలర్ట్.. మళ్లీ కరోనా కలకలం.. కొత్త వేరియంట్​తో జాగ్రత్త.. WHO హెచ్చరిక

-

గ్యాప్ ఇస్తూ మరీ కరోనా మహమ్మారి ప్రజలను భయపెడుతోంది. ప్రతిసారి కొత్త రకంగా రూపాంతరం చెందుతూ.. కొత్త కొత్త వేరియంట్​లతో వణికిస్తోంది. తాజాగా కొవిడ్​ ఒమిక్రాన్​ వేరియంట్​ నుంచి ఈజీ.5.1 అనే పేరుతో మరో వేరియంట్​ పుట్టుకొచ్చిందని.. యూకేలో ఆ కొత్త వేరియంట్​ కేసులు వమోదవుతున్నాయని ఆ దేశ ఆరోగ్య విభాగం అధికారులు వెల్లడించారు. ప్రతి ఏడు కరోనా కేసుల్లో ఈ కొత్త వేరియంట్​ కేసు ఒకటి ఉంటోందని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా ఆసియాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో యుకేలో ఈ వేరియంట్​ నమోదైందని యూకే హెల్త్​ సెక్యూరిటీ ఏజెన్సీ- యూకేహెచ్​ఎస్​ఏ వెల్లడించింది. ఈ వేరియంట్​ను జులై 31న EG.5.1గా వర్గీకరించారని చెప్పింది. దీన్ని ఎరిస్​ (Eris) అనే పేరుతో కూడా పిలుస్తున్నారని.. ఈ పరివర్తనాన్ని కొత్త వేరియంట్​గా ప్రకటించడం వల్ల.. డీటెయిల్డ్​ క్యారెక్టరైజేషన్, విశ్లేషణకు వీలు కలుగుతుందని పేర్కొంది.

కొత్త వేరియంట్​పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం చేస్తోంది. రెండు వారాలుగా ఈజీ.5.1ను ట్రాక్ చేస్తోంది. ప్రస్తుతానికి ఈ వైరస్​తో తీవ్రమైన ముప్పు ఏమీ లేదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news