ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయంగా దోహ.. భారత్ ర్యాంక్ ఎంతంటే?

-

2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్‌పోర్టుల జాబితా విడుదలైంది. స్టార్‌ రేటింగుతో ‘స్కైట్రాక్స్‌’ ఏటా విడుదల చేసే ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో ఖతర్‌ రాజధాని దోహాలోని హమద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి స్థానంలో నిలిచింది. సింగపూర్‌కు చెందిన ఛాంగి రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాలను గత కొన్నేళ్లుగా ఈ రెండు విమానాశ్రయాలే  ఉంటున్నాయి. జాబితాలో గతేడాది ఛాంగి అగ్రభాగాన నిలవగా ఈ ఏడాది హమద్ నిలిచింది.

ఇక దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఇన్చెయాన్‌ విమానాశ్రయం ఈసారి మూడోస్థానం దక్కించుకొంది. టోక్యోలోని హనీదా, నరీతా వరుసగా నాలుగు, అయిదు స్థానాలు దక్కించుకున్నాయి. హాంకాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఏకంగా 22 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకుకు చేరుకుంది. అమెరికాకు చెందిన ఏ ఒక్క విమానాశ్రయం  తొలి 20 స్థానాల్లో లేకపోవడం గమనార్హం. ఐరోపాలో ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌ చార్లెస్‌ డి గలే, మ్యూనిక్‌ (జర్మనీ), జ్యూరిచ్‌ (స్విట్జర్లాండ్‌) విమానాశ్రయాలు టాప్‌-10లో చోటు దక్కించుకున్నాయి.

ఈ జాబితాలో తొలి వంద ఎయిర్‌పోర్టుల్లో భారత్‌కు చెందినవి నాలుగు ఉన్నాయి. దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 36, బెంగళూరు 59, హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు స్థానం 61, ముంబయి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు 95వ స్థానంలో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news