పుతిన్‌, జిన్‌పింగ్‌, కిమ్‌ బిగ్ గేమ్ ప్లే చేస్తున్నారు.. మస్క్‌తో ఇంటర్వ్యూలో ట్రంప్‌

-

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధ్యక్ష అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే డెమోక్రాటిక్, రిపబ్లిక్ పార్టీల అధ్యక్ష అభ్యర్థులు కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్లు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్.. టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థల అధినేత, బిలియనీర్‌ ఎలాన్ మస్క్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత జిన్పింగ్, ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్లు గేమ్స్ ప్లే చేస్తున్నారని అన్నారు. వీళ్లు ముగ్గురు తమ తమ ఆటల్లో టాప్లో ఉన్నారనంటూ విమర్శించారు. వీళ్లు తమ దేశాన్ని అమితంగా ప్రేమిస్తారు.. కానీ వాళ్లది చాలా భిన్నమైన ప్రేమ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ ముగ్గురిని ఎదుర్కోవడానికి అమెరికాకు బలమైన లీడర్ అవసరమని.. ఆయన అభిప్రాయపడ్డారు. ఇక డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ గురించి మాట్లాడుతూ ఆమె గెలిస్తే అమెరికాలో విధ్వంసం జరుగుతుందని తీవ్రంగా ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version