నేను గెలవొద్దని కుట్ర చేస్తున్నారు.. జడ్జిపై డొనాల్డ్ ట్రంప్ ఫైర్

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని భావిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అడుగడుగునా ఎదురుదబ్బలే తగులుతున్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో ఇరుక్కున ట్రంప్ను ఇటీవలే కొలరాడో సుప్రీంకోర్టు ఎన్నికల్లో పోటీకి ఆయన అనర్హుడని ప్రకటించింది. ఇక తాజాగా సుమారు 370 మిలియన్ డాలర్ల పరువునష్టం కేసులో విచారణ సందర్భంగా కోర్టు ముందు హాజరైన ట్రంప్ తాను మరోసారి గెలవకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రేరణతోనే తనపై కక్ష సాధిస్తున్నారని అన్నారు.

370 మిలియన్ డాలర్ల పరువు నష్టం కేసులో తనకే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ తెలిపారు. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరాన్పైనా ట్రంప్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఆర్థిక లావాదేవీలు సరిగ్గా ఉన్నాయని, అవినీతి జరిగినట్లు ఆధారాలు లేవని తెలిపారు. 40 రోజులుగా సాగిన విచారణలో తనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లభించలేదని చెప్పారు. బ్యాంకులు ఇచ్చిన నగదు చెల్లించామని అయినా రాజకీయంగా తనను నిలదొక్కుకోనీయకూడదనే కక్షతో కొందరు ఇలా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. న్యూయార్క్ అటార్నీ జనరల్తో కలిసి తనను ఓడించడానికి ప్రయత్నిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news