అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే రెండు ఎన్నికల్లో ట్రంప్ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. తాజాగా మూడో ఎలక్షన్లోనూ ఘన విజయం సాధించారు. గురువారం రోజున వర్జిన్ ఐలాండ్స్‌లో జరిగిన ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ 73 శాతం ఓట్లు సాధించి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి నిక్కి హేలీకి కేవలం 26 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఎన్నికల ఫలితాలపై ప్రస్తుతం పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అందరికి ధన్యావాదాలు తెలిపారు. తాము ఘన విజయం సాధించామని, వాస్తవానికి తాము గెలుస్తామని ముందే ఊహించామని అన్నారు. కానీ ఇంత భారీ మెజారిటీతో గెలుస్తామని మాత్రం అనుకోలేదని సంతోషం వ్యక్తం చేశారు. అమెరికా ప్రజలు అందించిన ఈ విజయాన్ని ఎప్పుడూ మరిచిపోనని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, గురువారం జరిగిన వర్జినియా ఎన్నికల్లో అధికారులు నిబంధనలు పాటించలేదని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అనుమతించిన దాని కంటే ముందుగానే పోటీని నిర్వహించారని సమాచారం.