భారతదేశంపై డ్రోన్ దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్‌లో మే 9వ తేదీ అర్థరాత్రి ఆకస్మిక భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైందని అధికారులు తెలిపారు. ఏజెన్సీ నుంచి అందిన సమాచారం ప్రకారం.. రాత్రి 1:44 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్‌లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. భూకంపం కారణంగా, ప్రజల్లో భయాందోళనలు వ్యాపించాయి. అయితే, ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. మరోవైపు ఏప్రిల్ 22న భారత్ లోని జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత ఆపరేషన్ సిందూర్ కింద భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాదులు దాక్కున్న 9 ప్రదేశాలను ధ్వంసం చేసింది. భారతదేశం చర్య తర్వాత, పాకిస్తాన్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నుండి పంజాబ్, రాజస్థాన్ వరకు పౌరులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడి చేస్తోంది. అయితే, పాకిస్తాన్ పిరికి దాడులకు భారత సైన్యం తగిన సమాధానం ఇస్తోంది.