ట్విటర్​కు ఎలాన్ మస్క్ గుడ్​బై.. కొత్త సీఈవో ఎవరంటే..?

-

టెస్లా అధినేత, ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ సీఈఓ పదవి నుంచి మస్క్ వైదొలగనున్నారు. ట్విటర్​కు కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ను ఎంపిక చేసినట్లు మస్క్‌ ప్రకటించారు. ఆరు వారాల్లో నూతన సీఈవో బాధ్యతలు చేపట్టనున్నారని స్పష్టం చేశారు. ఇదంతా చెప్పిన మస్క్.. కొత్త సీఈవో ఎవరో మాత్రం చెప్పలేదు.

ట్విటర్ సంస్థలో తాను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతానని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. ఉత్పత్తి, సాఫ్ట్‌వేర్‌, సిసోప్స్‌లను పర్యవేక్షిస్తానని తెలిపారు. గతేడాది నవంబర్‌లోనే ట్విటర్‌లో తన సమయాన్ని కుదించుకుంటానని మస్క్‌ వెల్లడించారు. మస్క్‌ తాజా నిర్ణయంతో టెస్లా పెట్టుబడిదారుల ఆందోళన తగ్గింది. ఆ సమయాన్ని మస్క్‌.. టెస్లా కోసం కేటాయిస్తారని వారు ఆశిస్తున్నట్లు సమాచారం. ట్విటర్‌కు కొత్త సీఈఓ నిర్ణయం మస్క్‌ ప్రకటించగానే.. టెస్లా షేర్లు 2.4 శాతం పెరిగడం గమనార్హం.

మరోవైపు.. నూతన సీఈవో విషయాన్ని ప్రకటించకముందే మరో కొత్త అప్​డేట్​ను అందుబాటులోకి తీసుకువచ్చారు మస్క్​. ట్విటర్​ కొత్తగా తీసుకువస్తున్న ఎన్​క్రిప్టిడ్​ మెసేజింగ్​ సర్వీస్​ను వెరిఫైడ్ యూజర్లకు ముందుగానే అందుబాటులోకి వస్తున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version