పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కి వచ్చే పాక్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి మార్గం సుగమం అయినట్టు కనిపిస్తోంది. గతంలో అల్ -అజీజియా కేసులో ఆయనకు పడ్డ ఏడు సంవత్సరాల జైలు శిక్షను అక్కడి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో మూడు అవినీతి కేసుల్లో రెండు ప్రత్యేక కోర్టులు ఆయనకు బెయిల్ మంజూరు చేసాయి.
బ్రిటన్ లో నాలుగు సంవత్సరాల స్వీయ ప్రవాసం అనంతరం ఆయన తాజాగా స్వదేశం తిరిగి రావడం అందరికీ తెలిసిందే.ఈ ఏడాది ఎన్నిక్లలో బరిలో నిలబడాలనేది నవాజ్ షరీఫ్ లక్ష్యం అని తెలుస్తోంది. దీని వెనుక సైన్యం మద్దతు ఉందని వార్తలు వినిపించాయి. అల్ అజిజియా కేసులో 2018లో నవాజ్ షరీఫ్ కి ఏడేళ్ల కిందట శిక్ష పడింది. మూడేళ్ల జైలు జీవితం తరువాత చికిత్స కోసం అని లండన్ వెళ్లిన ఆయన అక్కడే ఉండిపోయారు. దీంతో ఆయనను పారిపోయిన ఖైదీగా ప్రకటించారు.