ప్ర‌వాసుల‌కు సౌదీ తీపి క‌బురు.. నేటి నుంచే అనుమ‌తి

-

సౌదీ అరేబియాలో నివసిస్తున్న ప్రవాసులకు అక్క‌డి ప్ర‌భుత్వం తాజాగా శుభ‌వార్త చెప్పింది. రీ-ఎంట్రీ వీసాలపై తమ దేశానికి వెళ్లి, క‌రోనా మహమ్మారి నేపథ్యంలో నిర్ణీత సమయానికి తిరిగి రాలేక‌పోయిన ప్ర‌వాసులు ఇప్పుడు సౌదీకి తిరిగి రావడానికి అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 15 ఉదయం 6 గంటల నుంచి ప్ర‌వాసులు తిరిగి సౌదీకి రావచ్చని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

అయితే, ఈ ఆర్డర్‌తో గడువు ముగిసిన రీ-ఎంట్రీ వీసా, జాబ్ వీసా, విజిటింగ్ వీసాలు ఉన్నవారు తిరిగి సౌదీకి వెళ్లే అవ‌కాశం ఏర్ప‌డింది. ఏదేమైనా, దేశంలోకి ప్రవేశించే ఎవరైనా స‌రే 48 గంటల ముందు జారీ చేసిన కొవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ చూపించాల్సిందేన‌ని‌ సంబంధిత అధికారులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news